ఆదరింపుము యేసువా ని - YouWorship
Aadarimpumu Yesuvaa Ni
Artist: వి.జిజాన్ సుందరరావు
Category: Praise & Worship
Song Lyrics
ఆదరింపుము యేసువా ని - న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక యాగశ్రయంబని - లెస్సగా మది నమ్మితిన్ ॥ఆద॥ 1. నిరతముండెడు పరమ ధనమను - నీతి జీవిత రీతిలో = పెరుగ గోరుచు నిన్ను జేరితి - ప్రేమ జూపుము యేసువా 2. సత్య సంధుడ లోక బాంధవ - సర్వశాంతి సుధాకర = నిత్యజీవ జలంబు లొసగుము - నీతి నిధుల సజీవుడా ॥ఆద॥ 3. ముందు వెనుకను దుష్ట శక్తుల - మూక నన్నరి కట్టగన్ = బంధితుండనైతి నా ప - ద్భాంధవ విడిపించుమా ॥ఆద॥ 4. పరమ పురమున కరుగ నేరని - పాలసుడనో రక్షకా = కరుణతో నా మొరను గైకొని - కలుషముల నెడబాపవే ॥ఆద॥ ర్. పరమ ధాముడ వని యెరిగి నీ - శరణు వేడితి నో ప్రభో = తనువు విడిచిన వేళలో నీ - తలుపు నాకై తెరువు మా ॥ఆద॥ Aadarimpumu Yesuvaa Ni - Nnaashrayinchithi Naa Kikan Ledu Veroka Yaagashrayambani - Lessagaa Madi Nammithin ॥Aada॥ 1. Nirathamundedu Parama Dhanamanu - Neethi Jeevitha Reethilo = Peruga Goruchu Ninnu Jerithi - Prema Joopumu Yesuvaa 2. Sathya Sandhuda Loka Baandhava - Sarvashaanthi Sudhaakara = Nithyajeeva Jalambu Losagumu - Neethi Nidhula Sajeevudaa ॥Aada॥ 3. Mundu Venukanu Dushta Shakthula - Mooka Nannari Kattagan = Bandhithundanaithi Naa Pa - Dbhaandhava Vidipinchumaa ॥Aada॥ 4. Parama Puramuna Karuga Nerani - Paalasudano Rakshakaa = Karunatho Naa Moranu Gaikoni - Kalushamula Nedabaapave ॥Aada॥ R. Parama Dhaamuda Vani Yerigi Nee - Sharanu Vedithi No Prabho = Thanuvu Vidichina Velalo Nee - Thalupu Naakai Theruvu Maa ॥Aada॥