ఆత్మ నియమము ద్వారా సాగి పోవుదము - YouWorship
Aathma Niyamamu Dvaaraa Saagi Povudamu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము - విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసుని జూచుచు - ఓపికతో మనము సాగి పోవుదము 1. భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమున ఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము 2. సిద్ధపరచిన పురమును - జేర వాగ్దానములను నమ్మి నడిచిన అబ్రహాము వలె - సాగి పోవుదము 3. ఘోరమైనయా జారత్వమునకు - దూరముగాను పారిపోయిన - యోసేపును బోలి సాగిపోవుదము 4. దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు భోగము విడిచిన మోషేవలె మనము సాగి పోవుదము 5. పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమును బోధించిన - పేతురు వలె మనము సాగి పోవుదము 6. పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించి పానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము 7. తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగ ప్రాణము విడిచిన - స్తెఫను వలె మనము సాగిపోవుదము Pallavi: Aathma Niyamamu Dvaaraa - Saagi Povudamu - Vishvaasamunaku Karthayu Daanini Konasaaginchu Yesuni Joochuchu - Opikatho Manamu Saagi Povudamu 1. Bhakthi Heenulaku Neethini Jaatuchu - Jala Pralayamuna Odalo Jerina - Novahuvale Manamu Saagi Povudamu 2. Siddhaparachina Puramunu - Jera Vaagdaanamulanu Nammi Nadichina Abrahaamu Vale - Saagi Povudamu 3. Ghoramainayaa Jaarathvamunaku - Dooramugaanu Paaripoyina - Yosepunu Boli Saagipovudamu 4. Devuni Prajalatho Shramaye Melani - Aigupthu Paapapu Bhogamu Vidichina Moshevale Manamu Saagi Povudamu 5. Parishuddhathmatho Nindina Vaadai - Dairyamugaa Vaakyamunu Bodhinchina - Pethuru Vale Manamu Saagi Povudamu 6. Poru Sahinchi Suvaartha Pakshamuna - Parugu Muginchi Paanaarpanamaina - Bhaktha Paulu Vale Saagi Povudamu 7. Thetaga Daiva Sangkalpamu Delpuchu - Raallanu Ruvvaga Praanamu Vidichina - Sthephanu Vale Manamu Saagipovudamu