ఆకాశ పక్షులను చూడండి - YouWorship
Aakaasha Pakshulanu Choodandi
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు అవి కోయవు గరిసెలలో దాచుకోవూ కొట్లలో కూర్చుకోవు ||ఆకాశ|| అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ దేవుడు కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ||ఆకాశ|| స్వార్ధము వంచన వాటికుండదు సాటివాని దోచుకొనే మనసు ఉండదు రేపటిని గూర్చిన చింత ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు ||ఆకాశ|| పక్షులను పోషించే ఆ దేవుడు మనుష్యులను పోషించుట మానివేయునా సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ ||ఆకాశ|| Aakaasha Pakshulanu Choodandi Avi Vitthavu Avi Koyavu Gariselalo Daachukovu.. Kotlalo Koorchukovu ||Aakaasha|| Anudinamu Kaavalasina Aahaaramu Andajeyunu Vaatiki Aa Devudu Kalasikattugaa Avi Egiri Pothaayi Kadupu Nimpukonipoyi Marala Thirigi Vasthaayi ||Aakaasha|| Swaardhamu Vanchana Vaatikundadu Saativaani Dochukone Manasu Undadu Repatini Goorchina Chintha Undadu Poota Elaa Gadapaalani Baadha Undadu ||Aakaasha|| Pakshulanu Poshinche Aa Devudu Manushyulanu Poshinchuta Maaniveyunaa Srushtilona Manishi Brathuku Shreshtamu Kadaa Prabhuvu Thodu Undagaa Manaku Enduku Baadha ||Aakaasha||