ఆకాశమే పట్టనోడు - YouWorship
Aakaashame Pattanodu
Artist: కే ఆర్ జాన్
Category: Christmas
Song Lyrics
అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2) ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2) అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు ఆది అంతమైన పరలోక నాథుడు(2) ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2) అన్నిటిని కలిగించిన మహరాజు కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2) ||ఆనందమే|| ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2) పాపమే లేని సుగుణాల సుందరుడు శాపము బాపను జన్మించెను చూడు (2) నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు (2) సర్వాధికారియైన మహరాజు దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే|| ||ఆకాశమే|| Avanilo Udbhavinche Aadi Sambhoothuni Choodare Pudamiye Paravshinche Pasibaaluni Choodagane.. Pasibaaluni Choodagane Aakaashame Pattanodu – Dharanilo Puttinaadu Daaveedu Puramunandu Deenudai – Velasinaadu Rakshakudu (2) Aanandame Mahaa Aanandame – Andariki Ilalo Santhoshame Aascharyame Idi Adbhuthame – Yesu Jananam Adbhuthame (2) Adrushya Devuni Mahima Swaroopudu Aadi Anthamaina Paraloka Naathudu (2) Aadiynadu Vaakyambugaa – Srushti Kaaryamu Jariginchinaadu Anaadi Nundi Gnaanambugaa – Srushti Kramamu Nadipinchinaadu (2) Annitini Kaliginchina Maharaaju Kanneetini Thudachutaku Digi Vachchinaadu (2) |||Aanandame|| Premanu Panche Premaamayudu Rakshana Ichche Rakshinche Devudu (2) Paapame Leni Sugunaala Sundarudu Shaapamu Baapanu Janminchenu Choodu (2) Nithyamundu Neethi Sooryudu – Sathya Saakshigaa Ilakochchinaadu Premanu Panche Paavanaathmudu – Pashula Paakalo Pavalinchinaadu (2) Sarvaadhikaariyaina Maharaaju Deebulaku Deevenagaa Digi Vachchinaadu (2) ||Aanandame|| ||Aakaashame||