ఆకాశంబు భూమియు - YouWorship
Aakaashambu Bhoomiyu
Artist: వ. చార్లెస్ కిన్సింగర్
Category: Prayer
Song Lyrics
1. ఆకాశంబు భూమియు - అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి సమయమున - ప్రార్థన చేతుము మా దేవా 2. చక్కని చుక్కలు మింటను - చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా - ప్రభువా గావుము గావుము నీ నీడన్ 3. చిన్న చిన్న పక్షులు - చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు - నిన్నే గొలిచి నిద్రించున్ 4. చిన్ని చిన్ని పాపలు - చిన్ని చిన్ని పడకలలో చిన్ని కన్నులు మూయంగా - చెన్నుగ యేసూ గావుమా 5. నేలను బోయెడి బండ్లలో - నీటను బోయెడి ఓడలలో గాలి విమానంబులలోన - కావుము దేవ ప్రయాణికులన్ 6. రాత్రిలో నీదు దూతలు - రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ - నిద్రించెదము మా దేవా 7. తెల్లవారుజామున - తెలివొంది మే మందరము మెల్లగ లేచి నుతియింపన్ - మేల్కొల్పుము నా ప్రియతండ్రి అనిశము నీకే చెల్లునుగా - అనిశము చెల్లును నీ ప్రభో 1. Aakaashambu Bhoomiyu - Anthata Cheekati Yaayenu Praakedu Cheekati Samayamuna - Praarthana Chethumu Maa Devaa 2. Chakkani Chukkalu Mintanu - Chakkagaa Mammunujoodaga Prakkaku Raave Vegamugaa - Prabhuvaa Gaavumu Gaavumu Nee Needan 3. Chinna Chinna Pakshulu - Chinna Chinna Poovulu Enno Enno Jeevulu - Ninne Golichi Nidrinchun 4. Chinni Chinni Paapalu - Chinni Chinni Padakalalo Chinni Kannulu Mooyanggaa - Chennuga Yesoo Gaavumaa 5. Nelanu Boyedi Bandlalo - Neetanu Boyedi Odalalo Gaali Vimaanambulalona - Kaavumu Deva Prayaanikulan 6. Raathrilo Needu Doothalu - Ramyambaina Rekkalatho Chithrambuga Mammunu Gramman - Nidrinchedamu Maa Devaa 7. Thellavaarujaamuna - Thelivondi Me Mandaramu Mellaga Lechi Nuthiyimpan - Melkolpumu Naa Priyathandri Anishamu Neeke Chellunugaa - Anishamu Chellunu Nee Prabho