అర్పింతు ప్రభువా నా జీవితం - YouWorship
Arpinthu Prabhuvaa Naa Jeevithang
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: అర్పింతు ప్రభువా నా జీవితం - సామర్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమ పరచ అర్హపాత్రగా చేయుము నన్ (2) 1. నే మట్టిని నీవు కుమ్మరివి - నీ సామర్థ్య హస్తముతో లేపు (2) అయోగ్యతలన్నీ తొలగించి - నీ కోర్కె చొప్పున నన్ను చేయు నిన్ను మహిమపరచ గోరితిన్ ప్రభువా, యోగ్య పాత్రగ చేయుము నన్ (2) 2. నే నిష్ఫల అంజూరపు చెట్టున్ - నా చుట్టూ కంచెను కోల్పోతిన్ కానరాలేదు ఫలమేమి నాలో - వ్యర్థపరచితిని భూమిన్ నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువా, ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము 3. నే అణచబడిన చిన్న చెట్టున్ - ముండ్ల పొదల మధ్య పడితిన్ ధనసుఖ ఆశల ద్వారా - అణచబడితిని నేను నానుండి ముండ్లను తీయుము ప్రభువా, నూరంతలుగా నే ఫలియింప 4. నా యెడల శాంతము చూపితివి - మరి యొక్క వత్సరమిచ్చితివి తోట మాలిగా నాకై వేడితివి - తప్పించితివి తీర్పునుండి వ్యర్థతీగెలను నరికి వేయు ప్రభువా, నే ఫలియించి నిను ఘనపరచ Pallavi: Arpinthu Prabhuvaa Naa Jeevithan - Saamarthyamu Gala Nee Chethilo Ninnu Mahima Paracha Arhapaathragaa Cheyumu Nan (2) 1. Ne Mattini Neevu Kummarivi - Nee Saamarthya Hasthamutho Lepu (2) Ayogyathalannee Tholaginchi - Nee Korke Choppuna Nannu Cheyu Ninnu Mahimaparacha Gorithin Prabhuvaa, Yogya Paathraga Cheyumu Nan (2) 2. Ne Nishphala Anjoorapu Chettun - Naa Chuttoo Kanchenu Kolpothin Kaanaraaledu Phalamemi Naalo - Vyarthaparachithini Bhoomin Naa Chuttoo Thravvi Eruveyumu Prabhuvaa, Phalamichche Yogyatha Naakimmu 3. Ne Anachabadina Chinna Chettun - Mundla Podala Madhya Padithin Dhanasukha Aashala Dvaaraa - Anachabadithini Nenu Naanundi Mundlanu Theeyumu Prabhuvaa, Nooranthalugaa Ne Phaliyimpa 4. Naa Yedala Shaanthamu Choopithivi - Mari Yokka Vathsaramichchithivi Thota Maaligaa Naakai Vedithivi - Thappinchithivi Theerpunundi Vyarthatheegelanu Nariki Veyu Prabhuvaa, Ne Phaliyinchi Ninu Ghanaparacha