అమ్మ కోసం - YouWorship
Amma Kosam
Artist: స్వప్న ఎడ్వర్డ్స్
Category: Thanksgiving
Song Lyrics
ఏ భాషకందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు – తీర్చలేని ఓ ఋణం ఎదలో దాగిన పలుకే నీవు – నా ప్రేమకు తొలిరూపం అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే లోకంలో ఈ తియ్యని బంధం కానరాలేదే నవ మాసాలు నీలో నన్ను దాచావు నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు రేయి పగలంతా నాకై శ్రమపడినా తీరని అనురాగం నీలో చూసానే నీ సుఖ సంతోషం విడచిన నాకై తరగని మమకారం నీలో దాచావే యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే భయ భక్తులే ఉగ్గి పాలగ పోసావు దేవుని మాటలే గోరు ముద్దగ చేసావు తప్పటడుగులే నాలో సరి చేసి ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగ నిలిపావు ప్రతి వేకువలో నాకై నీవు చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే ||ఏ భాషకందని|| Ae Bhaashakandani Bhaavam Neevu Velakattaleni Muthyam Neevu Devudichchina Varame Neevu Theerchaleni O Runam Edalo Daagina Paluke Neevu Naa Premaku Tholi Roopam Ammaa Ninu Minchina Bandham Ediyu Lede Lokamlo Ee Thiyyani Bandham Kaanaraalede Nava Maasaalu Neelo Nannu Daachaavu Naa Oopirikai Nee Praanam Panangaa Pettaavu Reyi Pagalanthaa Naakai Shramapadinaa Theerani Anuraagam Neelo Choosaane Nee Sukha Santhosham Vidachina Naakai Tharagani Mamakaaram Neelo Daachaave Yesayyaa Preme Ninnu Naakai Srushtinchinde Ammaa Ninu Minchina Bandham Ilalo Lene Lede Lokamlo Ee Thiyyani Bandham Kaanaraane Lede Bhaya Bhakthule Uggi Paalaga Posaavu Devuni Maatale Goru Muddaga Chesaavu Thappatadugule Naalo Sari Chesi Prabhu Sannidhilo Nannu Saakshiga Nilipaavu Prathi Vekuvalo Naakai Neevu Chese Praardhanale Penchenu Naa Balame Neelo Kaligina Vishwaasam Naatho Sahavaasinchene Ammaa Ninu Minchina Bandham Ilalo Lene Lede Lokamlo Ee Thiyyani Bandham Kaanaraane Lede ||Ae Bhaashakandani||