అమూల్య రక్తము ద్వారా - YouWorship
Amoolya Rakthamu Dwaaraa
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2) చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2) ||అమూల్య|| చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2) నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య|| నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2) స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2) ||అమూల్య|| కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2) ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2) ||అమూల్య|| తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2) మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2) ||అమూల్య|| పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2) కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2) ||అమూల్య|| మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2) మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2) ||అమూల్య|| Amoolya Rakthamu Dwaaraa Rakshana Pondina Janulaaraa Sarva Shakthuni Prajalaaraa Parishudhdhulaaraa Paadedamu Ghanatha Mahima Sthuthulanu Parishudhdhulaaraa Paadedamu Mana Yavvana Jeevithamul – Shareeraashaku Lobarachi (2) Chedu Maatalanu Palukuchu – Shaanthi Leka Yuntimigaa (2) ||Amoolya|| Chedu Maargamuna Pothimi – Daani Yanthamu Maranamu (2) Naraka Shikshaku Lobaduchu – Paapapu Dhanamu Pondithimi (2) ||Amoolya|| Nithya Sathya Devuni – Naamamuna Moralidaka (2) Swantha Neethi Thodane – Devuni Raajyamu Korithimi (2) ||Amoolya|| Kanikaramugala Devudu – Maanavaroopamu Daalchenu (2) Praanamu Siluvanu Balijesi – Manala Vimochinchenu (2) ||Amoolya|| Thana Raktha Dhaaralalo – Mana Paapamulanu Kadigi (2) Mana Kannulanu Therachi – Manala Nimpenu Gnaanamutho (2) ||Amoolya|| Paapulamaina Mana Meeda – Thana Yaascharya Ghana Prema (2) Kummarinchenu Mana Prabhuvu – Kruthagnatha Chellinthumu (2) ||Amoolya|| Mana Rakshakuni Sthuthinchedamu – Manalanu Jesenu Dhanyulugaa (2) Mana Devuni Karpinchedamu – Jeevaathma Shareeramulan (2) ||Amoolya||