అన్నీ సాధ్యమే యేసుకు - YouWorship
Anni Saadhyame
Artist: జే సీ కూచిపూడి
Category: Praise
Song Lyrics
అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2) మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే|| బండనే చీల్చగా – జలములే పొంగెను ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2) బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2) ||అన్నీ సాధ్యమే|| ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2) యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2) ||అన్నీ సాధ్యమే|| కష్టాల కడలిలో – కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2) కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే|| Anni Saadhyame Yesuku Anni Saadhyame (2) Adbhutha Shakthini Neraputakainaa Aascharya Kaaryamulosagutakainaa (2) Aa Yesu Rakthaanike Saadhyame Saadhyame Saadhyame (2) ||Anni Saadhyame|| Maadhuryamaina Jalamugaa – Maaraanu Prabhu Maarchenu Mruthyuvu Nundi Laajarunu – Maahimaardhamukai Lepenu (2) Mannaanu Kurpinchagaa – Aakaashame Therichenu Maranaanni Odinchagaa – Mruthyunjudai Lechenu (2) ||Anni Saadhyame|| Bandane Cheelchagaa – Jalamule Pongenu Endipoyina Bhoomipai – Aerulai Avi Paarenu (2) Bandante Kreesthenani – Nee Dandame Thaanani Mendaina Thana Krupalo – Neekandagaa Nilachunu (2) ||Anni Saadhyame|| Ekaanthamugaa Mokarilli – Praardhinchute Shreyamu Aela Naakee Shramalani – Poorna Mansutho Vedumu (2) Yesayya Nee Vedhana – Aalinchi Manninchunu Ae Paati Vyadhalainanu – Aa Silvalo Theerchunu (2) ||Anni Saadhyame|| Kashtaala Kadalilo – Kanneeti Loyalo Kanikarame Prabhu Choopunu – Kantipaapalaa Kaayunu (2) Kaliginchu Vishwaasamu – Kaadedi Asaadhyamu Kreesthesu Naamamulo – Kadagandlake Mokshamu (2) ||Anni Saadhyame||