అన్ని కాలంబుల - YouWorship
Anni Kaalambula
Artist: బేతాళ జాన్
Category: Praise
Song Lyrics
అన్ని కాలంబుల – నున్న యెహోవా ని నెన్నదరంబయో – కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు లున్నతమై యుండ – మున్నె నీకు ||అన్ని|| నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములను బన్నుగ జేసిన – బలుడ వీవె ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం పన్నతతో నేలు – ప్రభుడ వీవె అన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుo – డవు నీవే ఎన్న శక్యముగాక – ఉన్న లక్షణముల సన్నుతించుటకు నే – జాలుదునా ||అన్ని|| పుట్టింప నీవంచు – బోషింప నీవంచు గిట్టింప నీవంచు – గీర్తింతును నట్టి పనికి మాలి – నట్టి మానవుల చే పట్టి రక్షింప బా – ధ్యుండ వంచు దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి పట్టయు నిలచియుండు – ప్రభుడ వంచు గట్టడచే గడ – ముట్టుదనుక నా పట్టుకొలది నిన్ను – బ్రస్తుతింతు ||అన్ని|| కారుణ్య నిధి వీవు – కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడ వీవు – పాపి నేను సార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్న దారిద్రుడే లేడు – తరచి చూడ సార సద్గుణముల – సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సం – చారి, నేను ఏ రీతి స్తుతియింతు – నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ – నెర నమ్మితి ||అన్ని|| Anni Kaalambula – Nunna Yehovaa Ni Nennadarambayo – Kanna Thandri Vanne Kekkina Moksha – Vaasaali Sannuthu Lunnathamai Yunda – Munne Neeku ||Anni|| Ninnu Brakatana Seya – Nikhila Lokamulanu Bannuga Jesina – Baluda Veeve Unna Lokambula – Nudugaka Karunaa Sam Pannathatho Nelu – Prabhuda Neeve Anni Jeevula Nerigi – Yaahaara Michchuchu Nunna Sarvagnun – Davu Neeve Enna Shakyamugaaka – Unna Lakshanamula Sannuthinchutaku Ne – Jaaludunaa ||Anni|| Puttimpa Neevanchu – Boshimpa Neevanchu Gittimpa Neevanchu – Geerthinthunu Natti Paniki Maali – Natti Maanavula Che Patti Rakshimpa Baa – dhyunda Vanchu Dattamaina Krupanu Dari Jercha Naakichchi Pattayu Nilachiyundu – Prabhuda Vanchu Gattadache Gada – Muttudanuka Naa Pattukoladi Ninnu – Brasthuthinthu ||Anni|| Kaarunya Nidhi Veevu – Katinaathmudanu Nenu Bhoori Shudhdhuda Veevu – Paapi Nenu Saara Bhaagyuda Veevu – Jagathilo Naakanna Daaridrude Ledu – Tharachi Chooda Saara Sadgunamula – Sampannudavu Neevu Ghora Durguna Sam – Chaari, Nenu Ae Reethi Sthuthiyinthu – Ne Reethi Sevinthu Nera Mennaka Prova – Nera Nammithi ||Anni||