అనుదినము మా భారము భరించే దేవా - YouWorship
Anudinamu Maa Bhaaramu Bharinche Devaa
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: అనుదినము మా భారము - భరించే దేవా (1) అనిశము నీ మేళ్ళతో - నింపుచున్నావు (2) 1. సన్నుతించు మనిశము - నా ప్రాణమా యేసుని (2) పరిశుద్ధ నామమును - పొగడు మెప్పుడు (2) ఒంటె బరువు దీవెనలు - వీపున మోపె (2) 2. నా శరీరమున ముల్లు - బాధపరచుచుండగా వేదనతో వేడగా - ధైర్యమిచ్చితివి నా కృప నీ కెల్లప్పుడు - చాలునంటివి 3. అపరాధముతో మేము చిక్కుకొని యుండగా నీ రక్తముచే మమ్ము - విమోచించితివి నీదు కృపా మహదై-శ్వర్యంబును బట్టి 4. అన్నిటిలో నెప్పుడు - సకల సంపదలతోను సమృద్ధితో మమ్ములను - సాకుచుంటివి కృపా క్షేమములను మాపై - కుమ్మరించితివి 5. సర్వవేళల సంతృప్తిని - నేర్పినావు మాకిల సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి బలపరచుము నిన్ను బట్టి - బలుడగు దేవా Pallavi: Anudinamu Maa Bhaaramu - Bharinche Devaa (1) Anishamu Nee Mellatho - Nimpuchunnaavu (2) 1. Sannuthinchu Manishamu - Naa Praanamaa Yesuni (2) Parishuddha Naamamunu - Pogadu Meppudu (2) Onte Baruvu Deevenalu - Veepuna Mope (2) 2. Naa Shareeramuna Mullu - Baadhaparachuchundagaa Vedanatho Vedagaa - Dhairyamichchithivi Naa Krupa Nee Kellappudu - Chaalunantivi 3. Aparaadhamutho Memu Chikkukoni Yundagaa Nee Rakthamuche Mammu - Vimochinchithivi Needu Krupa Mahadai-Shvaryambunu Batti 4. Annitilo Neppudu - Sakala Sampadalathonu Samruddhitho Mammulanu - Saakuchuntivi Krupa Kshemamulanu Maapai - Kummarinchithivi 5. Sarvavelala Santhrupthini - Nerpinaavu Maakila Sakalambunu Cheyutaku Shakthinichchithivi Balaparachumu Ninnu Batti - Baludagu Devaa