అనాది దేవుడు ఆశ్రయము - YouWorship
Anaadi Devudu Aashrayamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే (2) అను పల్లవి: నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు - మరణము వరకు మమ్ము నడిపించును (1) || అనాది || 1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ (2) ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్ (1) 2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్ 3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును 4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు 5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్ 6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు Pallavi: Anaadi Devudu Aashrayamu - Thana Baahuvulu Nee Kaadhaarame (2) Anu Pallavi: Nithyamaina SathyaDevudu Sarvakaalamu Mana Devudu - Maranamu Varaku Mammu Nadipinchunu (1) || Anaadi || 1. Karunathone - Aakarshinche Shuddha Divya Prema (2) Ee Aranyamulo Aashachoopi Neeku - Brathimaaluchu Ninnu Pilichen (1) 2. Andhakaara Maarga Mandu Shuddha Divyajyothi Duhkhapoorithamagu Loyalannitini - Neeti Yootalugaa Maarchen 3. Krupanu Choopi Manassu Karige Shuddha Divya Prema Needu Samaadhaanamanubandhamunu - Nikkamuga Prabhuve Kaayunu 4. Ee Bhuvin Neevu - Gadupu Yaathra Prabhuvu Dayavalane Kaaradavi Yainan - Prabhu Rommunane - Dorukunu Nemmadi Neeku 5. Endina Jeevithamu - Chigirinchinade DaivaKrupavalane Shaashvathaanandamu Shiramupai Velayun - Duhkhamu Nittoorpulu Povun 6. Santhasamutho Thirigirammu Daivabalamuche Seeyonu Kondakaayana Ninnu Cherchunu - Shaashvathaananda Mondedavu