అదే అదే ఆ రోజు - YouWorship
Ade Ade Aa Roju
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే|| వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు (2) నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే|| సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు (2) భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు (2) కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే అదే|| వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు (2) అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక (2) చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2) బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| Ade Ade Aa Roju Yesayya Ugratha Roju Edendla Shramala Roju Paapulanthaa Edche Roju ||Ade Ade|| Vadagandlu Kurise Roju Bhoomi Sagam Kaale Roju (2) Nakshathramulu Raale Roju Neeru Chedu Ayye Roju Aa Neeru Sevinchina Manushulanthaa Chachche Roju ||Ade Ade|| Suryudu Nalupayye Roju Chandrudu Erupayye Roju (2) Bhookampam Kalige Roju Dikku Leka Arache Roju Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu ||Ade Ade|| Midathala Dandochche Roju Neeru Rakthamayye Roju (2) Kopaagni Ragile Roju Parvathamulu Pagile Roju Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu ||Ade Ade|| Vyabhichaarulu Edche Roju Mosagaallu Masale Roju (2) Abadhdhikulu Arache Roju Dongalanthaa Dorike Roju Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu ||Ade Ade|| Pilla Jaada Thalliki Leka Thalli Jaada Pillaku Leka (2) Chettukokkarai Puttakokkarai Anaathalai Arache Roju Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu ||Ade Ade|| O Manishi Yochimpavaa Nee Brathuku Elaa Unnado (2) Balamu Choosi Bhanga Padakumaa Dhanamu Choosi Dagaa Padakumaa Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu ||Ade Ade||