అడిగినది కొంతే అయినా - YouWorship
Adiginadi Konthe Ainaa
Artist: క్రాంతి చేపూరి
Category: Praise
Song Lyrics
పాట రచయిత: క్రాంతి చేపూరి అడిగినది కొంతే అయినా పొందినది ఎంతో దేవా ప్రతిగా ఏమివ్వగలనయా నిను స్తుతియించే హృదయము తప్ప నా జీవితం నీకే అంకితమయ్యా – (4) ||అడిగినది|| ఊహించలేని వివరింపజాలని నీ కార్యములు ఆశ్చర్యమే యోచించినా నా వర్ణనకందని నీ కృపా కనికరములు అత్యున్నతమే తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా యుగయుగములకు నీకే ఘనతా మహిమా సతతం నిను నే కొనియాడెదను సకలం నీ నామముకే స్తోత్రము తగును ||అడిగినది|| క్షణ భంగురం నా క్షయ జీవితం కాచావయ్యా నను నీ రెక్కల నీడ ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా ||అడిగినది|| మహిమోన్నతుడా నను మరువని విభుడా ప్రణుతించెదను నిన్నే నిరతం నిష్కలంకుడా నిర్మలాత్ముడా ప్రకటించెదను నీ పావన చరితం నా అతిశయము నీవే నా యేసయ్యా నా ఆధారము నీవే నా మెస్సయ్యా నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా ఈ దీన సేవను చేకొనుమయ్యా ||అడిగినది|| Lyricist: Kranthi Chepuri Adiginadi Konthe Ainaa Pondinadi Entho Devaa Prathigaa Emivvagalanayaa Ninu Sthuthiyinche Hrudayamu Thappa Naa Jeevitham Neeke Ankithamayyaa – (4) ||Adiginadi|| Oohinchaleni Vivarimpajaalani Nee Kaaryamulu Aascharyame Yochinchinaa Naa Varnanakandani Nee Krupaa Kanikaramulu Athyunnathame Tharatharamulaku Maarani Nee Unnatha Premaa Yugayugamulaku Neeke Ghanatha Mahimaa Sathatham Ninu Ne Koniyaadedanu Sakalam Nee Naamamuke Sthothramu Thagunu ||Adiginadi|| Kshana Bhanguram Naa Kshaya Jeevitham Kaachaavayyaa Nanu Nee Rekkala Needa Ae Yogyatha Leni Alpuraala Nannu Hechchinchaavayyaa Nee Prema Thoda Naa Aashraya Durgamu Neeve Yesayya Naa Rakshana Shrungamu Neeve Messaiah Naa Sthuthiki Paathrudavu Neevenayyaa Ee Sthothra Keerthana Neekenayyaa ||Adiginadi|| Mahimonnathudaa Nanu Maruvani Vibhudaa Pranuthinchedanu Ninne Niratham Nishkalankudaa Nirmalaathmudaa Prakatinchedanu Nee Paavana Charitham Naa Athishayamu Neeve Naa Yesayyaa Naa Aadhaaramu Neeve Naa Messaiah Naa Aaraadhana Aalaapana Neekenayya Ee Deena Sevanu Chekonumayyaaa ||Adiginadi||