అంధకార చెరసాలలో - YouWorship
Andhakaara Cherasaalalo
Artist: జోయెల్ కొడాలి
Category: Prayer
Song Lyrics
అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2) భూమియే కంపించెను – చెరసాల అదిరెను వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2) వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో ||అంధకార|| ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై యేసుని వేడెదము – శోకము తొలగించమని ||అంధకార|| మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో ||అంధకార|| Andhakaara Cherasaalalo – Bandhakaala Irukulo Poulu Seelalu Praardhinchiri – Keerthanalu Paadiri – (2) Bhoomiye Kampinchenu – Cherasaala Adirenu Vaari Sankellu Oodipoyenu – Vidudala Dorikenu – (2) Vyaadhulu Aavarinchagaa – Maranamu Tharumuchundagaa Randi Paari Podumu – Inka Daagi Yundumu Ae Thegulu Dari Cherani – Ae Digulu Undani Mana Daagu Sthalamulo Yesuni Sannidhilo ||Andhakaara|| Praardhana Chesedamu – Devuni Samukhamulo Ee Shodhana Samayamulo – Virigina Hrudayamutho Ee Loka Rakshanakai – Janamula Swasthathakai Yesuni Vededamu – Shokamu Tholaginchamani ||Andhakaara|| Moralanu Aalakinchunu – Yesu Manalanu Vidipinchunu Ee Lokamunu Shudhdhi Cheyunu – Maranamunu Thappinchunu Mana Rakshana Valayamugaa – Thana Rekkalu Chaapunu Dukhamunu Santhoshamugaa – Maarchiveyunu Thvaralo ||Andhakaara||