అంటరాని వాడవంటు - YouWorship
Antaraani Vaadavantu
Artist: జోయెల్ కొడాలి
Category: Prayer
Song Lyrics
అంటరాని వాడవంటు నన్ను ఊరు బైటకు త్రోసి వేసిరి దేహమంతా కుళ్లిపోయి – దుర్వాసనతో నిండిపోయే అయిన వారు కానరాక – భుజము తట్టే వారు లేక కంటి నిండా నిదుర పొక – ఒంటరిగ జీవించలేక మరణమును బ్రతిమాలుకున్నా… మరణమును బ్రతిమాలుకున్నా – అదియు నన్ను ముట్టలేదు చావలేక బ్రతుకలేక విసికిపోయాను – నేను అలసిపోయాను నీ దరికి చేరాను – నిన్నే నమ్ముకున్నాను యేసు.. యేసు.. యేసు నా తట్టు తిరగవా యేసు.. యేసు.. యేసు నా గోడు వినవా ||అంటరాని|| నిలిచిపోయావు నా కేక వినగానే కదలిపోయావు నా స్థితిని చూడగనే నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి నేను కరిగిపోయాను నీ కనికరము చూసి – కన్నీటితో తడిసిపోయాను యేసు.. యేసు.. యేసు నీకెంత జాలి చాలు.. చాలు.. చాలు నీ దయయే చాలు ||అంటరాని|| నన్ను తాకావు నీ చేతులను చాపి కుష్టు రోగము నా దేహము పైన ఉండగనే నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి నన్ను ముట్టుకున్నావు ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను యేసు.. యేసు.. యేసు నీలా ఉందురెవరు చాలు.. చాలు.. చాలు నీ స్పర్శ చాలు ||అంటరాని|| స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు నాకు బ్రతుకు నిచ్చావు నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరు యేసు.. యేసు.. యేసు దండములు నీకు చాలు.. చాలు.. నాకింక నీవే చాలు ||అంటరాని|| Antaraani Vaadavantu Nannu Ooru Baitaku Throsi Vesiri Dehamanthaa Killupoyi – Durvaasanatho Nindipoye Ayina Vaaru Kaanaraaka – Bhujamu Thatte Vaaru Leka Kanti Nindaa Nidura Poka – Ontariga Jeevinchaleka Maranamunu Brathimaalunnaa.. Maranamunu Brathimaalunnaa – Adiyu Nannu Muttaledu Chaavaleka Brathukaleka Visikipoyaanu – Nenu Alasipoyaanu Nee Dariki Cheraanu – Ninne Nammukunnaanu Yesu.. Yesu.. Yesu Naa Thattu Thiragavaa Yesu.. Yesu.. Yesu Naa Godu Vinavaa ||Antaraani|| Nilichipoyaavu Naa Keka Vinagaane Kadalipoyaavu Naa Sthithini Choodagane Nee Kadupuloni Dukhamunu Nee Mukhamupai Choosi Nenu Karigipoyaanu Nee Kanikaramu Choosi – Kanneetitho Thadisipoyaanu Yesu.. Yesu.. Yesu Neekentha Jaali Chaalu.. Chaalu.. Chaalu Nee Dayaye Chaalu ||Antaraani|| Nannu Thaakaavu Nee Chethulanu Chaapi Kushtu Rogamu Naa Dehamu Paina Undagane Naa Gunde Lopala Manduchunna Korikanu Choosi Nannu Muttukunnaavu Aa Sparsha Korake Kadaa Ne Thapiyinchi Poyaanu Yesu.. Yesu.. Yesu Neelaa Undurevaru Chaalu.. Chaalu.. Chaalu Nee Sparsha Chaalu ||Antaraani|| Swasthaparichaavu Shuddhunigaa Chesaavu Muriki Koopamu Nundi Nannu Levanetthaavu Naa Thalanu Paiketthukoni Brathike Tharunamichchaavu Naaku Brathuku Nichchaavu Ninu Aashrayinchi Niraasha Chendu Narulu Evvaru Yesu.. Yesu.. Yesu Dandamulu Neeku Chaalu.. Chaalu.. Naakinka Neeve Chaalu ||Antaraani||